బోయిస్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది
బోయిస్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని ‘బోయిస్‌’ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈసారి సామూహింగా వేడుకలకు హాజరు కాలేకపోయారు. జూమ్‌ మీటింగ్‌ ద్వారా ఈ సంబురాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. లక్ష్మీనారాయణ తాతపూడి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యక్షురాలు రమ్య తాతపూడి, కార్యదర్శి ప్రసాద్ సిద్దబత్తుని, కార్యదర్శి వెంకట భార్గవ్ ఐనంపూడి, కోశాధికారి సందీప్ చలమలశెట్టి, నిర్వాహకులు అనిల్ కుకుట్లకు అసోసియేషన్‌ అధ్యక్షులు సుబ్బు కొమ్మిరెడ్డి అభినందనలు తెలిపారు. అనంత్ నిభానుపూడి, ప్రియాంక నిభానుపూడి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అందరిలో జోష్‌ నింపారు.


మరిన్ని