హ్యూస్టన్‌లో ఘనంగా సినారె జయంతి వేడుకలు
హ్యూస్టన్‌లో ఘనంగా సినారె జయంతి వేడుకలు

హ్యూస్టన్ /టెక్సాస్ : జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, పద్మభూషణ్‌ డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి 90వ జయంతి వేడుకలు హ్యూస్టన్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అభినందనలతో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళాసమితి ఓమన్‌, వేగేశ్న ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్, శారదా ఆకునూరి- అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ, శిరోమణి డా వంశీ రామరాజు అందరికీ స్వాగతం పలుకుతూ.. గత 40 ఏళ్ల నుంచి సినారె జన్మదినాన్ని, జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.42లక్షలు కేటాయించి వేగేశ్న ఫౌండేషన్‌లోని దివ్యాంగుల కోసం ఒక భవనం నిర్మించేందుకు సహకరించారని గుర్తుచేసుకున్నారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి సమన్వయకర్తగా వ్యవహరించి  తన మాటలు, పాటలతో అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినారె కుటుంబ సభ్యులు జ్యోతిప్రజ్వలనం చేశారు.

ప్రముఖ దర్శకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళాతపస్వి  కె. విశ్వనాథ్‌ వీడియో ద్వారా సినారెతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నారాయణ రెడ్డి మొదటి పాటకు నటించిన ప్రజానటి, కళాభారతి, మాజీ ఎంపీ డా. జమునా రమణారావు, సినీ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీ మోహన్, సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, సంగీత దర్శకులు సాలూరు వాసూరావు, సినీగేయ రచయిత భువనచంద్ర, సంగీత దర్శకులు మాధవపెద్ధి సురేష్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, గీతా గాన గంధర్వ ఎల్వీ గంగాధర శాస్త్రి, అపర ఘంటసాల తాతా బాలకామేశ్వర రావు, అమెరికా నుంచి డా శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్ నుంచి డా నగేష్ చెన్నుపాటి, సంతోషం ఫిల్మ్ న్యూస్ వ్యవస్థాపకులు శ్రీ సురేష్ కొండేటి, తెలుగు కళాసమితి ఓమన్, అనిల్ కుమార్ కడించెర్ల, హరి వేణుగోపాల్ ఓమన్, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దీపికా రవి, వంశీ అధ్యక్షులు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ వంశీ, ఛైర్‌పర్సన్‌ -వేగేశ్న సుంకరపల్లి శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినారెకు ఘన నివాళులర్పించారు.


మరిన్ని