హెలికాప్టర్‌ కూలి ఐదుగురి మృతి
హెలికాప్టర్‌ కూలి ఐదుగురి మృతి

అలాస్కా: అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌ గ్లేషియర్‌ను (హిమనీనదం) హెలికాప్టర్‌ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు అలాస్కా స్టేట్‌ ట్రూపర్స్‌ ప్రతినిధి ఆస్టిన్‌ డేనియల్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

‘యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌ హిమనీనదం వద్ద హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించగా.. పైలట్‌ సహా ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు గుర్తించాం. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉండగా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అలాస్కా ఆర్మీ నేషనల్‌ గార్డ్స్‌, మౌంటెయిన్‌ రెస్క్యూ బృందాల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’ అని డేనియల్‌ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్‌ ఏవియేషన్‌ తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. మరోవైపు జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement


మరిన్ని