మస్కట్‌లో గోదావరి జిల్లాల మహిళల కష్టాలు
మస్కట్‌లో గోదావరి జిల్లాల మహిళల కష్టాలు

మస్కట్‌: ఉద్యోగాల కోసమని విదేశాలకు పొట్టచేతపట్టుకుని వెళ్లిన ఉభయగోదావరి జిల్లాల మహిళలు మస్కట్‌లో చిక్కుకున్నారు. కువైట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఏజెంట్‌ తమను మోసం చేసి దుబాయ్‌కి చెందిన వారికి అమ్మేయాలని చూస్తున్నట్టు వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ దగ్గర ఏజెంట్‌ పాస్‌పోర్టు లాగేసుకున్నాడని, ప్రస్తుతం తాము మస్కట్‌ ఎంబసీలో ఉన్నట్లు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారి బాధను వెళ్లగక్కిన మహిళలు.. సీఎం జగన్‌ ఎలాగైనా చొరవ చూపి తమను స్వదేశానికి వచ్చేలా చెయ్యాలని వేడుకుంటున్నారు.

 


Advertisement

Advertisement


మరిన్ని