న్యూజెర్సీలోని నిరాశ్రయులకు ‘నాట్స్‌’ చేయూత
న్యూజెర్సీలోని నిరాశ్రయులకు ‘నాట్స్‌’ చేయూత

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో కరోనా వైరస్‌ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) అండగా నిలిచింది. నగరంలోని బ్రాన్స్‌విక్‌  ప్రాంతంలో నిరాశ్రయకులకు నాట్స్‌ ఉచితంగా ఆహార పదార్థాలను పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ ఉంటున్న నిరాశ్రయులను ఆదుకుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో నాట్స్‌ నాయకులు రమేశ్‌ నూతలపాటి, రాజ్‌ అల్లాడ, వంశీ వెనిగళ్ల, చంద్రశేఖర్‌ కొణిదెల, సూర్య గుత్తికొండ, శేషగిరి కంభంమెట్లు, కూమార్‌ వెనిగళ్ల, తదితరులు పాల్గొన్నారు. నాట్స్‌ మాజీ అధ్యక్షుడు, బోర్డ్ డైరెక్టర్‌ కృష్ణ మన్నవ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలకు నాట్స్‌ చేయూతగా ఉంటుందని డైరెక్టర్‌ మోహనకృష్ణ మన్నవ తెలిపారు. 


మరిన్ని