రాజధాని రైతులకు యూకేలో ఎన్నారైల సంఘీభావం
రాజధాని రైతులకు యూకేలో ఎన్నారైల సంఘీభావం

బర్మింగ్‌హామ్‌: అమరావతి రాజధాని రైతుల పోరాటానికి యూకేలోనూ ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌, కోవెంట్రీ నగరాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రులు అమరావతి రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అమరావతి రైతుల పోరాటం 200 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ సంఘీభావ కార్యక్రమంలో ‘మూడు రాజధానులు వద్దు - అమరావతే ముద్దు’; ‘ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని’ అంటూ నినదించారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.

Advertisement


మరిన్ని