జాక్‌పాట్‌ కొట్టిన భారతీయుడు 
జాక్‌పాట్‌ కొట్టిన భారతీయుడు  

యూఏఈ లాటరీలో రూ.19.90 కోట్లు దక్కించుకున్న పంజాబీ 

దుబాయ్‌: యూఏఈలో ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌ సింగ్‌(35).. లాటరీలో ఏకంగా రూ19.90 కోట్లు గెలుచుకున్నారు. భారత్‌ నుంచి వచ్చి లాటరీతో సంపన్నులైన అదృష్టవంతుల జాబితాలో తాజాగా ఆయన చేరారు. షార్జాలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన 067757 నంబరుతో ఉన్న లాటరీ టికెట్‌ను ఆగస్టు 12న కొనుగోలు చేసినట్లు అక్కడి ఓ వార్తా సంస్థ శుక్రవారం తెలిపింది. తన లాటరీ టికెట్‌కు బహుమతి లభించిందని నిర్వాహకులు గురువారం ఆయనకు ఫోన్‌ చేశారు. ‘‘నేను పనిలో ఉండగా ఎవరో ఫోన్‌ చేసి నాకు లాటరీలో రూ.19.90కోట్ల బహుమతి లభించిందని చెప్పడంతో ముందుగా ఆశ్చర్యపోయాను. లాటరీలో వచ్చిన సొమ్ముతో యూఏఈలో ఇల్లు కొంటాను’’ అని గుర్‌ప్రీత్‌ అన్నారు.                       

 

Tags :

మరిన్ని