ఎన్టీఆర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ‘పసుపు-కుంకుమ’
ఎన్టీఆర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ‘పసుపు-కుంకుమ’

కువైట్‌: ఎన్టీఆర్‌ సేవా సమితి (కువైట్) అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో కువైట్‌లో పసుపు- కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. తెదేపా కువైట్ విభాగం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు. చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్ హాబిబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమం మెదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, నందమూరి తారక రామారావు, చంద్రబాబు ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఆడపడుచులను ఈ విధంగా గౌరవించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్, విక్రమ్ ఆంజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Tags :

మరిన్ని