డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి
డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి

టెక్సాస్‌: మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) ఆధ్యర్యంలో డల్లాస్‌లో అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత కాన్సుల్‌ జనరల్ అసీం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు. జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఇర్వింగ్‌ నగర మేయర్‌ రిక్‌ స్తోఫెర్‌ ప్రత్యేక అతిథిగా విచ్చేసి గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలు అజరామరం అంటూ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అతిథులుగా విచ్చేసిన కాన్సుల్‌ జనరల్‌, మేయర్‌కు గాంధీ చిత్రపటాలను బహూకరించారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, డైరెక్టర్లు- అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్న జాని, రాంకీ, స్వాతి షా, శైలేష్ షా, సలహా సంఘ సభ్యులు - పద్మశ్రీ ఏకే మాగో, సీసీ థియోఫిన్, ఎంవీఎల్ ప్రసాద్, అరుణ్ అగర్వాల్, తైయాబ్ కుండవలా, పియూష్ పటేల్, దినేష్ హుడా, రాహుల్ ఛటర్జీ, రాజీవ్ కామత్, ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి తదితరులు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని