ఈలియట్‌ పురస్కార రేసులో భాను కపిల్‌
ఈలియట్‌ పురస్కార రేసులో భాను కపిల్‌

లండన్‌: ప్రముఖ ఆంగ్లకవి టి.ఎస్‌.ఈలియట్‌ పురస్కారానికి కుదించిన పది మంది జాబితాలో భారత సంతతికి చెందిన భాను కపిల్‌కు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌లో పుట్టి... లండన్‌లో పెరిగిన కపిల్‌.. ‘హౌ టు వాష్‌ ఏ హార్ట్‌’ కవితతో ప్రాచుర్యం పొందారు. ఆరు పుస్తకాలు రాశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కవితల విభాగంలో విందామ్‌-కాంపెల్‌ బహుమతిని సొంతం చేసుకున్నారు. టి.ఎస్‌.ఈలియట్‌ పురస్కారాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. విజేతకు 25 వేల పౌండ్లు. కుదించిన జాబితాలో చోటు దక్కిన వారికి 1500 పౌండ్లు అందజేస్తారు

Tags :

మరిన్ని