సింగపూర్‌లో ఘనంగా  బతుకమ్మ సంబురాలు
సింగపూర్‌లో ఘనంగా  బతుకమ్మ సంబురాలు

సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో జూమ్‌ వేదికగా వీటిని నిర్వహించారు. విదేశంలో ఉండి కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్న తెలుగువారికి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపి, టీసీఎస్‌ఎస్‌ కృషిని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బంజారా జానపద కళాకారిణి అశ్విని రాథోడ్ ధూం ధాం పాటలతో అలరించారు.

సంబరాలు విజయవంతంగా జరగడానికి సహాయం అందించిన దాతలకు, స్పాన్సర్స్‌కు,  టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలకు సమన్వయకర్తలుగా గడప స్వాతి రమేశ్, దీప నల్ల, నంగునూరి సౌజన్య, బొడ్ల రోజా రమణి, గోనె రజిత నరేందర్ రెడ్డి, కల్వ రాజు, దుర్గా ప్రసాద్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, నర్రా నిర్మల, ఆర్‌.సి.రెడ్డి, గార్లపాటి లక్ష్మారెడ్డి, జూలూరి పద్మజ సంతోష్, బసిక అనితా రెడ్డి, సునీత రెడ్డి మిర్యాల, పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు.


Advertisement

Advertisement

Tags :

మరిన్ని