బైడెన్ గెలుపుతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు
బైడెన్ గెలుపుతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు

నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ  

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుపుతో అమెరికా-భారత్ సంబంధాలు మరింత మెరుగు పడతాయని నాట్స్ పూర్వఅధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ హయాంలో వలస విధానంలో కఠిన నిబంధనల అమలు వల్ల భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే కొత్త ప్రభుత్వం హయాంలో భారతీయ విద్యార్థులకు F-1 స్టూడెంట్ వీసా విషయంలో, అలాగే ఉపాధి కల్పించే H-1B వీసాల విషయంలోనూ మేలు జరుగుతుందని మోహనకృష్ణ అభిప్రాయపడ్డారు. జో బైడెన్, కమలా హారిస్ ఆధ్వర్యంలో భారత్-అమెరికా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఎదుర్కొంటున్న కొవిడ్ మహమ్మారి, ఆరోగ్య భద్రత, ప్రతి పౌరుడికీ వైద్య సదుపాయాలు కల్పించే చట్టం, వలసలు, జాతి వివక్ష, లింగ సమానత్వం, పెరుగుతోన్న ఆర్థిక అసమానతలు, మిత్ర దేశాలతో సత్సంబంధాలు లాంటి అనేక విషయాలలో బైడెన్ నేతృత్వంలో పరిష్కారం దొరుకుతుందని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయన్నారు. అమెరికా చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళ ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన కమలా హారిస్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

  

Advertisement

Advertisement

Tags :

మరిన్ని