అబూదాబిలో నిర్మించే హిందూ దేవాలయం ఆకృతి ఖరారు
అబూదాబిలో నిర్మించే హిందూ దేవాలయం ఆకృతి ఖరారు

దుబాయ్‌: యూఏఈలోని అబూదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయ ఆకృతులను ఆలయ నిర్వాహకులు వీడియో రూపంలో విడుదల చేశారు. భారత ఇతిహాసాలు, గ్రంథాలు, పురాతన గాధలతో ఆలయ గోడలు అలరారనున్నాయని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ భారీ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. డిసెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం నిర్మిస్తున్న ‘ఆధ్యాత్మిక ఒయాసిస్సు’గా ఈ ఆలయాన్ని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని