తానా నవలల పోటీ-2021కి ఆహ్వానం
తానా నవలల పోటీ-2021కి ఆహ్వానం

 ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలుగు, ప్రపంచ సాహిత్యంలో కలకాలం నిలిచే నవలలను వెలికితీయాలనే ఉద్దేశంతో ‘తానా నవలల పోటీ-2021’ నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తమ నవలకు రూ. 2 లక్షల బహుమతి అందజేయనున్నట్లు పేర్కొంది. నవలలు తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలని.. ప్రపంచంలో తెలుగువారెవరైనా ఇందులో పాల్గొనవచ్చని తానా తెలిపింది. చేతిరాతతో లేదా డీటీపీ చేసి అక్షర క్రియేటర్స్‌, ఏజీ-2, ఏ బ్లాక్‌, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్‌, హైదర్‌గూడ, హైదరాబాద్‌-29 చిరునామాకు పంపవచ్చు. లేదంటే 2021 tananovel@gmail.comకు మెయిల్‌ చేయొచ్చు. నవలపై రచయిత పేరు, చిరునామా ఉండకూడదని.. కవరింగ్‌ లెటర్‌పైనే ఉండాలని స్పష్టం చేసింది. రచనలను వచ్చే ఏప్రిల్‌ 15లోపు అందేలా పంపాలి. వివరాలకు 98493 10560 నంబరులో సంప్రదించవచ్చు.

Tags :

మరిన్ని