టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడిగా నీలం మహేందర్‌
టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడిగా నీలం మహేందర్‌

సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) అధ్యక్షుడిగా నీలం మహేందర్‌ ఎన్నికయ్యారు. టీసీఎస్‌ఎస్‌ ఏడో సర్వ సభ్య సమావేశాన్ని ఈనెల 20న జూమ్‌ ద్వారా నిర్వహించారు. సుమారు 100మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారంతా ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్‌ని, ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో ఎన్నికల పర్యవేక్షకులు నవీన్ ముద్రకోల్ల, దోర్నాల చంద్రశేఖర్‌లు నీలం మహేందర్‌ని అధ్యక్షునిగా ప్రకటించారు. తనపై నమ్మకంతో మరోసారి ఈ బాధ్యతను అప్పగించిన ఇక్కడి తెలంగాణ వాసులకు మహేందర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని  మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షులు నీలం మహేందర్‌, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులుగా గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్‌రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీతరెడ్డి,  ప్రాంతీయ కార్యదర్శులుగా దుర్గాప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులుగా నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, చక్కిలం ఫణిభూషణ్, గజ్జి రమాదేవి, నగమడ్ల దీప, ఆరూరి కవిత, వీరమల్లు కిరణ్, రంగ పట్నాలలతో పాటు, కార్యనిర్వాహక వర్గంలో పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, పట్టూరి కిరణ్ కుమార్, రవి కృష్ణ, కాసర్ల శ్రీనివాస్‌లు ఉన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని