2022లో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు
2022లో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

సింగపూర్‌: అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 47వ వర్ధంతి సందర్భంగా ‘సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్, సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలం వేదికగా ‘ఘంటసాల పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమం జరిగింది. రాధికా మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ధూళిపాళ ఆంజనేయ మిత్ర, గాయని శివశంకరి గీతాంజలి ఘంటసాల పాటలను ఆలపించి ఆయనకు గాననివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు మాట్లాడుతూ.. 2022 డిసెంబరులో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థతో కలిసి ఘంటసాల శత జయంతి ఉత్సవాలను సింగపూర్‌లో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాపోలు వెంకట్ సాంకేతిక నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సింగపూర్ నుంచి ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు వీక్షించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని