సింగపూర్‌లో వాసవీ మాత ఆత్మార్పణ కార్యక్రమాలు
సింగపూర్‌లో వాసవీ మాత ఆత్మార్పణ కార్యక్రమాలు

సింగపూర్: సింగపూర్‌లోని స్థానిక వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అక్కడి ఆర్యవైశ్యులందరూ చైనాటౌన్‌లోని స్థానిక మారియమ్మన్ ఆలయంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా వాసవీ మహా శాంతి హోమం, అమ్మవారి మూల విరాట్టుకి ప్రత్యేక అభిషేకం, లలితా సహస్రనామ పఠనం జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకారంతో రథోత్సవం నిర్వహించారు.

కొవిడ్ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక నియమావళిని ప్రకారం యాభై మందికి మించకుండా, అందరూ సమదూరాన్ని పాటిస్తూ, మాస్క్‌ ధరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అరుణ్ గొట్లూరు, సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి, సీనియర్ సభ్యులైన నాగరాజ్ కైలా, శ్రీధర్ మంచికంటి, కోర్ కమిటీ సభ్యులైన ముకేశ్ భూపతి, రాజా విశ్వనాథుల, ముక్కా కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని