అసీం మహాజన్‌కు ఘన సన్మానం
అసీం మహాజన్‌కు ఘన సన్మానం

డల్లాస్‌(టెక్సాస్‌): అమెరికాలో తెలుగువారి విజ్ఞానం, ఆధిక్యత విశేష ప్రభావం చూపుతుందని కాన్సల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి అసీం మహాజన్‌ ప్రశంసించారు. అవసరమైనప్పుడు వీలైన సహాయం అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ప్రవాస భారతీయ నాయకులు ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో డల్లాస్‌లోని ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్‌లో గురువారం కాన్సల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి అసీం మహాజన్‌కు ఆతిథ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు సంఘాల నాయకులు రఘువీర్ బండారు తెలంగాణ పీపుల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టిపాడ్), డా.శ్రీధర్ కొర్సపాటి (నాటా), డా.సంధ్యా రెడ్డి గవ్వ (ఆటా), లక్ష్మి పాలేటి, మురళి వెన్నం (తానా), శేఖర్ అన్నే (నాట్స్), మహేంద్రరావు (డాటా)లు పాల్గొన్నారు. స్థానికంగా, జాతీయ స్థాయిలో, మాతృ దేశంలో చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను తెలుగు సంఘాల ప్రముఖులు కాన్సల్ జనరల్‌కు వివరించారు. అనంతరం తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున ప్రసాద్ తోటకూర అసీం మహాజన్‌ను ఘనంగా సన్మానించారు. 

Tags :

మరిన్ని