భక్తిశ్రద్ధలతో రామాయణ జయ మంత్రం
భక్తిశ్రద్ధలతో రామాయణ జయ మంత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీ రామ నవమి సందర్భంగా 22 దేశాలలోని వారంతా సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్యర్యంలో  ఏర్పాటు చేసిన అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో రామాయణ జయ మంత్రం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా  నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్, మలేషియా తెలుగు సంఘం మలేషియా, పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి.కళాశాల తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో జయ మంత్రదీక్ష కార్యక్రమం జరిగింది. ఇండోనేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రామాయణ హరినాథ రెడ్డి దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరినాథరెడ్డి మాట్లాడుతూ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఉపాసించిన జయ మంత్రం అత్యంత శక్తివంతమైందన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జయ మంత్ర దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జయ మంత్రం అందరినీ విజయ బాటలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు వెయ్యి మందికి పైగా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్ దేశాల్లోని వారు జూమ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారని చెప్పారు. కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘం ఉపాధ్యక్షులు సూర్య నారాయణ, పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ సునీత, ఉషారాణి, డాక్టర్‌ అరుణ కుమారి, సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్య చిర్ల తదితరులు అడిగిన రామాయణంలోని సందేహాలకు హరినాథ్ రెడ్డి సమాధానాలిచ్చారు.

Advertisement

Tags :

మరిన్ని