తెలుగు వచ్చిన వారికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు
తెలుగు వచ్చిన వారికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు

తానా అధ్యక్షుడు జయశేఖర్‌

ఈనాడు, అమరావతి: అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భాషల్లో తెలుగు ముందుందని, తెలుగు వచ్చిన వారికి భవిష్యత్తులో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తానా అధ్యక్షుడు తాళ్లూరు జయశేఖర్‌ తెలిపారు. ‘తెలుగు కూటమి’ భాషోద్యమ సంస్థ ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘రచ్చబండ ఊసులు’ పేరిట వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయశేఖర్‌ మాట్లాడుతూ...‘తానా సంస్థ తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు అయిదు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తోంది. తానా పాఠశాల వేదిక ద్వారా ‘ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు’ కార్యక్రమం కింద 10వేల మంది బయటి రాష్ట్రాల విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు’ అని వివరించారు. ‘తెలుగు కూటమి’ వ్యవస్థాపకుడు కోదండరామయ్య మాట్లాడుతూ.. తెలుగులో నామఫలకాలు రాయించిన వారికి  రూ.5వేలు, మంచి ఉద్యమ గీతానికి రూ.వెయ్యి, తెలుగు నినాదానికి రూ.500 వంతున కూటమి తరఫున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల వివరాలను తెలుగులోనే ఉంచాలని కోరాలని, దీంతో భాష నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలుగు సాంకేతిక నిపుణుడు వీవెన్‌ తెలిపారు.

Advertisement

Tags :

మరిన్ని