ముగ్గురు విద్యార్థులకు తానా ల్యాప్‌టాప్‌ల వితరణ
ముగ్గురు విద్యార్థులకు తానా ల్యాప్‌టాప్‌ల వితరణ

కర్నూలు: నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో లక్షా యాభై వేల రూపాయల విలువైన మూడు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు కళాశాలకు హాజరవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆదరణ కార్యక్రమంలో భాగంగా డి.చందన సాయి, పూర్ణ చరిత, మహ్మద్‌ అలీమ్‌కు ల్యాప్‌టాప్‌లు అందించారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ కోఆర్డినేటర్ సామినేని రవి తెలిపారు. ముప్పా రాజశేఖర్,  సందడి మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని