ఉత్సాహంగా సీవీఆర్‌ కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఉత్సాహంగా సీవీఆర్‌ కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

డల్లాస్‌ : సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం డల్లాస్‌ నగరంలో ఘనంగా జరిగింది. కళాశాల 20 సంవత్సరాల విద్యా వైభవాన్ని పురష్కరించుకొని అక్టోబర్‌ 23న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎంతో ఉత్సాహంగా పూర్వ విద్యార్థులు పాల్గొని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ సమ్మేళనంలో విశ్వవ్యాప్తంగా రాణించిన విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మన్‌ డా.రాఘవ వి చెరబుడ్డి.. గత 20 ఏళ్లలో తమ కళాశాల సాధించిన విజయాలను, అధిగమించిన  మైలురాళ్లను సభలో పంచుకున్నారు. ఈ సందర్బంగా తమ పూర్వ విద్యార్థుల విశిష్టతను, వివిధ రంగాలలో  వారు సాధించిన ప్రగతిని  కొనియాడుతూ భావితరాలకు తమ విజ్ఞాన్ని పంచేవిధంగా తదుపరి కార్యాచరణను ప్రకటించవలసిందిగా కోరారు. ఇక ఈ కార్యక్రమంలో  పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ మధురమైన పూర్వ సంఘటలను గుర్తుకు తెచ్చుకున్నారు. సీవీఆర్‌ ఉపన్యాసకులు అందించిన సాంకేతిక నైపుణ్యాన్ని, కల్పించిన ఉద్యోగ అవకాశాల్ని  శ్లాఘించారు. అనంతరం జరిగిన విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 

పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రెండో సమ్మేళనం ఇది. మొదటిది కాలిఫోర్నియా నగరంలో అక్టోబర్ 10న విజయవంతంగా ముగిసింది.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని