సీఏసీఏసీ సహ ఛైర్మన్‌గా రాజా కృష్ణమూర్తి
సీఏసీఏసీ సహ ఛైర్మన్‌గా రాజా కృష్ణమూర్తి

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సీఏపీఏసీ ఇమ్మిగ్రేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ సహ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటికే ఈ టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలైన భారత సంతతికి చెందిన ప్రమీలా జైపాల్‌ వ్యవహరిస్తున్నారు. తనను సీఏపీఏసీ సహ ఛైర్మన్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు రాజా కృష్ణమూర్తి తెలిపారు. అమెరికా వలస విధానం, దేశ విలువల్ని కాపాడేలా టాస్క్‌ఫోర్స్‌ ఛైర్‌పర్సన్‌ ప్రమీలా జైపాల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డ్రీమర్స్‌ (తాత్కాలిక పౌరసత్వ గ్రహీతలను రక్షించే చట్టం), సమగ్ర వలస విధానానికి మద్దతు, వలసదారులకు వీసాల పునరుద్ధరణ, పౌరసత్వాలను ప్రోత్సహించడం సహా ఏఏపీఐ వలసదారుల ఏకీకరణ సమస్యలు తీర్చటమే లక్ష్యంగా ఇమ్మిగ్రేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది.

ఇదీ చదవండి

బైడెన్‌ బృందంలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిమరిన్ని