భారతీయులకు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారాలు
భారతీయులకు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారాలు

లండన్‌: బ్రిటన్‌ అత్యున్నత పురస్కారాల విజేతల జాబితాలో భారత్‌ సంతతికి చెందిన కొవిడ్‌-19 సిబ్బంది, విద్యావేత్తలు, నటులు, సంగీత కళాకారులు చోటు దక్కించుకున్నారు. ఏటా బ్రిటన్‌ రాణి పేరిట ఈ అవార్డులు ఇస్తారు. వినోదరంగంలో బ్రిటిష్‌ టెలివిజన్‌ నటి నీనా వాడియా, సేవారంగంలో దీపాన్విత గంగూలీ, వైద్యరంగంలో ప్రొఫెసర్‌ పార్థసారథి, వ్యాపార రంగంలో లార్డ్‌ దల్జిత్‌ రాణాలకు బ్రిటన్‌ రెండో అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) లభించింది.  అవార్డుల గ్రహీతల జాబితాలో 14 మంది బ్రిటిష్‌ సిక్కులు ఉన్నారు. 

ఇవీ చదవండి..

ఫైజర్‌ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

కొత్త కరోనా: శాస్త్రీయ సమాచారమిదే..

Advertisement

Advertisement


మరిన్ని