ట్రంప్‌ అరెస్ట్‌కు బాగ్దాద్‌ కోర్టు వారెంట్‌ జారీ
ట్రంప్‌ అరెస్ట్‌కు బాగ్దాద్‌ కోర్టు వారెంట్‌ జారీ

బాగ్దాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇరాక్‌లోని బాగ్దాద్‌ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తమ దేశానికి చెందిన పారామిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌ హత్య కేసు విచారణలో భాగంగా ట్రంప్‌ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాక్‌ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 406 ప్రకారమే ట్రంప్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేసినట్లు బాగ్దాద్‌ న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానం వెల్లడించిన ప్రకారం.. ‘ముహందిస్‌ కుటుంబసభ్యుల నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాతే ఈ వారెంటు జారీ చేస్తున్నాం. ఈ కేసులో ఇప్పటికే ప్రాథమిక విచారణ ముగిసింది. కానీ ఇంకా ఈ నేరంలో పాత్ర ఉన్న ఇరాకీలు లేదా ఇతర విదేశీయులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది’ అని కోర్టు వెల్లడించింది. 

గతేడాది జనవరి 3న ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ, ఇరాక్‌ పారా మిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌లు యూఎస్‌ డ్రోన్‌ దాడిలో మరణించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలతో వారిని హత్య చేసినట్లు తెలియడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇరాన్‌ న్యాయస్థానం ఇప్పటికే ట్రంప్‌ను అరెస్ట్‌ చేయాలంటూ గత జూన్‌లో ఇంటర్‌పోల్‌ వారెంటు జారీ చేసింది. 
 

Advertisement

Advertisement


మరిన్ని