జో బైడెన్‌ కీలక ప్రతిపాదన
జో బైడెన్‌ కీలక ప్రతిపాదన

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కీలక ప్రతిపాదన చేశారు. పాలన చేపట్టిన వందరోజుల్లోగా వంద మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ పేరిట కీలక ప్రతిపాదన చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళిక ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. మరో వైపు ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఈనెల 20న సెనెట్‌లో చర్చ జరగనుంది. అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం చేయనున్నారు.

జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం  ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది. ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన 10మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు ప్రతినిధుల సభలో ఓటింగ్‌లో పాల్గొనలేదు. నలుగురు ఇండో అమెరికన్‌ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు. ఈ తీర్మానంపై సెనెట్‌ ఓటింగ్‌ నిర్వహించనుంది. సెనెట్‌లో ఆమోదం పొందితే ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. సెనెట్‌ ఈనెల 19కి వాయిదా పడింది. సెనెట్‌లో ఆమోదం పొందడానికి డెమొక్రాట్లకు 17 ఓట్లు అవసరం.

ఇవీ చదవండి..

ల్యాపీ వేడెక్కుతోందా? ఇలా చేయండి

కేంద్రం విఫలమైతే.. మేమే టీకాను ఫ్రీగా ఇస్తాం! మరిన్ని