అరుదైన కమలా హారిస్‌ గాజు చిత్రం: ఎలా చేశారంటే..
అరుదైన కమలా హారిస్‌ గాజు చిత్రం: ఎలా చేశారంటే..

వాషింగ్టన్‌: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 56 ఏళ్ల ఈ భారత సంతతి మహిళ అనేక అంశాల్లో తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఆ దేశంలో మరో ఉన్నత గౌరవం దక్కింది. దేశ రాజధానిలోని చారిత్రక లింకన్‌ మెమోరియల్‌ స్థలం వద్ద కమలా హారిస్‌కు చెందిన వైవిధ్యభరితమైన చిత్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా మహిళల విజయానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఇది.. పూర్తిగా గాజు చిత్రపటం కావటం విశేషం. ఫిబ్రవరి 6 నుంచి ఇది  సందర్శకులకు అందుబాటులో ఉండనుంది.

గాజు చిత్రం.. తయారీ విశిష్టం
ఆరున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉన్న ఈ ప్రత్యేకమైన చిత్రపటాన్ని..  స్విట్జర్లాండుకు చెందిన సిమోన్‌ బెర్గర్‌ అనే కళాకారుడు రూపొందించారు. ఈ ప్రక్రియ అతి సున్నితమైనదే కాకుండా అత్యంత నైపుణ్యంతో కూడుకున్నది. కాగా, సందర్శకులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసేందుకు వీలుగా దీని మీద క్యూఅర్‌ కోడ్‌ కూడా ఏర్పాటు చేయడం విశేషం.  

కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ, నల్ల జాతికి చెందిన తొలి వ్యక్తి, తొలి ఇండియన్‌ అమెరికన్‌, నల్లజాతీయుల కళాశాల, విశ్వ విద్యాలయాల్లో చదువుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారని.. ఇది దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే విజయమని ఈ శిల్పాన్ని బహూకరించిన ప్రముఖ నేషనల్‌ వుమెన్స్‌ హిస్టరీ మ్యూజియం పేర్కొంది.

ఇవీ చదవండి..

కమలా హారిస్‌.. ముత్యాల హారం వెనుక రహస్యం

బైడెన్‌ ప్రభుత్వం.. అన్నీ రిపేర్‌ చేస్తాం..


Advertisement

Advertisement


మరిన్ని