కమలా హారిస్‌ నివాసం వద్ద తుపాకీతో వ్యక్తి 
కమలా హారిస్‌ నివాసం వద్ద తుపాకీతో వ్యక్తి 

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధికార నివాసం వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడం కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని మసాచుసెట్స్‌లో ఉన్న కమలా హారిస్‌ అధికార నివాసం వద్ద అత్యాధునిక తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాన్‌ అంటోనియో ప్రాంతానికి చెందిన పాల్‌ ముర్రే (31) అనే వ్యక్తి హారిస్‌ నివాసం వద్ద ఉండటాన్ని గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. అతడిని పరిశీలించగా లైసెన్స్‌ లేని అత్యాధునిక తుపాకీ లభ్యమైనట్లు తెలిపారు. మెట్రోపాలిటన్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.మరిన్ని