కువైట్‌లో నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు
కువైట్‌లో నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు

కువైట్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యవర్గ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ దేశంలోనే మంచి రాజకీయ నాయకుడని సుధాకర్‌ రావు అన్నారు. ప్రజాసేవలో తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణను మించిపోతున్నారని అన్నారు. పీఆర్వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ గతంలో లోకేష్ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పల్లెల్లో వేయించిన సిమెంటు రోడ్లు, ఎల్‌ఈడీ బల్బులు ఇప్పటికీ ఉన్నాయే తప్ప.. ఇప్పటి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు బూతులు తిట్టటానికే సమయం కేటాయిస్తున్నారని, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఈ వేడుకల్లో ఏనుగొండ నరసింహులు, ఈడుపుగంటి ప్రసాద్, బోయపాటి శ్రీను, విజయ కూమర్, గంటా గోపి, వంశీ, నరేష్, మంచూరి శివ, గూదె శంకర్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని