నాట్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు విశేష స్పందన
నాట్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు విశేష స్పందన

హ్యూస్టన్‌: అమెరికాలోని తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) టెన్నిస్‌ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఉత్సాహం కనబరిచారు. రెండు విభాగాల్లో జరిగిన పోటీల్లో.. ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు. తెలుగువారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి పోటీల నిర్వహణపై సంఘ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ సదా అందుబాటులో ఉంటుందని బోర్డు సభ్యుడు సునీల్ పాలేరు అన్నారు. క్రీడా సమన్వయకర్త చంద్ర తెర్లీ నేతృత్వంలో వీరు కంకటాల, సునీల్ పాలేరు, హేమంత్ కొల్ల, శ్రీనివాస్ కాకుమాను తదితరులు టోర్నమెంట్‌ విజయానికి కృషి చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీ నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని కేంద్ర కమిటీ సభ్యుడు, సహాయ కోశాధికారి హేమంత్ కొల్ల అభినందించారు.

​​​​​​

Tags :

మరిన్ని