ఒహైయో సెనేట్‌కు తొలి భారత సంతతి వ్యక్తి.. 
ఒహైయో సెనేట్‌కు తొలి భారత సంతతి వ్యక్తి.. 

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలోని ఒహైయో రాష్ట్ర చట్టసభ సభ్యుడిగా తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. 29 ఏళ్ల వయస్సులోనే నీరజ్‌  జే అంతానీ .. ఒహైయో సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. ఆ రాష్ట్రంలోని సిక్స్‌త్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంత సెనేటర్‌గా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఆయన ప్రమాణం చేశారు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడైన అంతానీ.. 2014 నుంచి ఇప్పటి వరకు 42వ ఓహియో హౌస్‌ డిస్ట్రిక్ట్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

తాను పుట్టి పెరిగిన భారతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని నీరజ్‌ అంతానీ అన్నారు. ఈ అవకాశమిచ్చిన ఓటర్లు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చదవండి..

అమెరికాలో మార్మోగిన కోటి సాయి నామం..

అగ్రరాజ్యంలో న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి

Advertisement

Advertisement


మరిన్ని