తెలంగాణ రైతులకు ఎన్నారైల విరాళం
తెలంగాణ రైతులకు ఎన్నారైల విరాళం

హైదరాబాద్‌: రైతుల పట్ల ఎన్నారైలు తమ ఉదారత చాటుకున్నారు. కట్టంగూర్‌, నల్గొండ రైతుల సంక్షేమం కోసం ఎన్నారై వ్యాపారవేత్తలు శశికాంత్‌ వల్లేపల్లి, రామ్‌ బొబ్బా రూ.25లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును ‘శ్రీకారం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. రైతులకు భారీ విరాళం ఇచ్చిన ఎన్నారైలను మంత్రి అభినందించారు.

కమర్షియల్‌ చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రాలు, సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న శర్వానంద్‌ తాజాగా ‘శ్రీకారం’ చిత్రంలో నటించారు. ఆధునిక వ్యవసాయం గురించి తెలిపేలా, సేద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంపై నిర్మించిన కమర్షియల్‌ చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా... బి.కిశోర్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


మరిన్ని