క్యాన్సర్ బాధితుడికి ఎన్నారై తెదేపా (USA‌) సాయం 
క్యాన్సర్ బాధితుడికి ఎన్నారై తెదేపా (USA‌) సాయం  

విశాఖ: క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఎన్నారై తెదేపా (అమెరికా) సాయం చేసింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తెదేపా సీనియర్‌ నేత గొర్లి మోహనరావు కుమారుడు గొర్లి అరవింద్‌ గౌరినాయుడు గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాధితుడికి ఎన్నారై తెదేపా కార్యకర్తలు మేము సైతం అంటూ రూ.2లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సాయం చెక్కును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేతుల మీదుగా మోహనరావుకు అందజేశారు. కష్టంలో ఉన్న వారికి అండగా మేమున్నామంటూ ఎంతో సహృదయంతో ముందుకొచ్చిన ఎన్నారై తెదేపా (అమెరికా) కార్యకర్తలకు లోకేశ్‌ అభినందనలు తెలిపారు. మోహన్‌రావు కుటుంబానికి పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కష్టంలో ఉన్న కార్యకర్తలకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Tags :

మరిన్ని