తెలుగు భాషా దినోత్సవంపై ఆన్‌లైన్‌ సదస్సు
తెలుగు భాషా దినోత్సవంపై ఆన్‌లైన్‌ సదస్సు

హైదరాబాద్‌: గిడుగు రామమూర్తి 158వ జయంతి సందర్భంగా సౌత్‌ ఆఫ్రికన్‌ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు-నార్వే, ఏపీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆగస్ట్‌ 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 55పైగా తెలుగు సంఘాల సహకారంతో దీన్ని నిర్వహిస్తు్న్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పలువురు వక్తలు ప్రసంగాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొవిడ్‌-19 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు కళాకారులకు ప్రోత్సాహం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని.. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

Advertisement

Tags :

మరిన్ని