ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా లక్ష్మీ అన్నపూర్ణ
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా లక్ష్మీ అన్నపూర్ణ

డల్లాస్‌: మాతృ భాష, సంస్కృతి, సంప్రదాయాలకు పట్టంకట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం- టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా... పాలేటి లక్ష్మీ అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. 2021 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని.... జనవరి 3న డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థ టాంటెక్స్‌కు సారథ్యం వహించే బాధ్యతను తనకు అప్పగించినందుకు... పాలేటి అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా కృషి చేస్తానన్నారు. అమెరికాలోని తెలుగువారి ఆదరణతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తానని లక్ష్మీ అన్నపూర్ణ చెప్పారు.

ఇదీ చదవండి..  తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా శ్రీనివాస గోగినేని పోటీ..


Advertisement

Advertisement


మరిన్ని