తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవంతం చేయండి
తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు విజ్ఞప్తి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ‘వీధి అరుగు- నార్వే’; ‘దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతులకు పట్టం కడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని 75కి పైగా తెలుగు సంస్థల సమన్వయంతో రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకను విజయవంతం చేయాలని తెలుగు సాహితీ ప్రియులకు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 28న వర్చువల్‌గా ప్రారంభమయ్యే ఈ అంతర్జాతీయ సదస్సుకు  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. 29న జరిగే కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల తెలుగు భాషా పండుగకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్తలతో పాటు సినీ, రాజకీయ, పాత్రికేయ, సామాజిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష వికాసానికి పాటుపడుతున్న 12 మందికి ప్రవాస తెలుగు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పలు దేశాల కళాకారులతో తెలుగు జానపద, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారతదేశం నుంచి ప్రముఖ రచయితలు, కవి పండితులు ఆసక్తికర సాహిత్యోపన్యాసాలు, చర్చలు ఉంటాయన్నారు. తెలుగు సాహితీ ప్రియులందరినీ ఎంతగానో అలరించే మరిన్ని చక్కటి కార్యక్రమాల పరంపరతో జరగబోయే ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని https://youtu.be/ahjiJ6XvLB8https://www.facebook.com/SATELUGUCOMMUNITY ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చని తెలిపారు. 

Advertisement

Tags :

మరిన్ని