తుర్లపాటి కుటుంబరావు మృతి తీరని లోటు
తుర్లపాటి కుటుంబరావు మృతి తీరని లోటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, జర్నలిస్ట్‌, కళాప్రపూర్ణ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల కెనడాలోని తెలుగు ప్రజల ప్రతినిధి, రాజకీయ నేత ప్రసాద్‌ పాండా సంతాపం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల వయసులోనే కుటుంబరావు జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించి అనంతరం ఉన్నతంగా ఎదిగి ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అనేక రంగాల్లో ప్రతిభను చాటి ఎంతో పేరు గడించారని పేర్కొన్నారు. 65 సంవత్సరాల ఆయన ప్రజా జీవితంలో దాదాపు 20 వేల సభల్లో ప్రసంగించి, అందులో 10 వేల సభలకు అధ్యక్షత వహించి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించడం పట్ల తెలుగువాడిగా ఎంతో గర్వించానన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఆయన కుమారుడు తుర్లపాటి జవహర్‌ సహా ఆయన కుటుంబ సభ్యులకు కెనడాలో తెలుగువారి తరఫున, ఆల్బర్టా ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జనవరి 10వ తేదీన కుటుంబరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి...

టీకా అభివృద్ధిని నిలిపేసిన మెర్క్‌!

అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళికమరిన్ని