కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా
కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా

వాషింగ్టన్, హ్యూస్టన్‌: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు సబ్రీనా సింగ్‌ నియమితులైనట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. బైడెన్, హ్యారిస్‌ ఎన్నికల ప్రచారంలోనూ కమలా హ్యారిస్‌ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనా సేవలందించారు. ఈమెతో పాటు వైట్‌హౌస్‌లో పనిచేసే పలువురు సభ్యుల నియామకాలను ప్రకటించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారని కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌ వ్యాఖ్యానించారు. ప్రముఖ మల్టీ నేషనల్‌ కెమికల్‌ కంపెనీ ‘లిండెల్‌ బసెల్‌’ సీఈవో, ఛైర్మన్‌ అయిన ఇండియన్‌-అమెరికన్‌ భవేశ్‌ వి పటేల్‌ (53)ను ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ డల్లాస్‌ తన హ్యూస్టన్‌ శాఖ బోర్డు డైరెక్టరుగా నియమించింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ఇవీ చదవండి..

చిమ్మచీకట్లో పాక్‌..

బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి పెన్స్‌

Advertisement


మరిన్ని