అక్కడ వేడుక.. ఇక్కడ పండగ
అక్కడ వేడుక.. ఇక్కడ పండగ

ప్రవాస భారతీయులూ సంబరాల్లో పాల్గొనండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగింట అంబరాన్నంటే సంబరం సంక్రాంతి పండగ. ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు, పల్లె అందాలు, కొత్త అల్లుళ్లు, నోరూరించే వంటకాలు, వివిధ రకాల క్రీడలు, రంగవల్లులు, క్రీడా పోటీలు.. ఇలా ఎన్నో విశేషాలు.. మరువలేని గుర్తులు ఎన్నో. సంక్రాంతి వస్తుందంటే ఎక్కడెక్కడి వారంతా సొంతూళ్లకు రెక్కలు కట్టుకుని వచ్చేస్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ మహమ్మారి విదేశాల్లో ఉంటున్న వారిని స్వగ్రామాలకు రాకుండా అడ్డుకట్ట వేస్తోంది. మనసు ఇక్కడ ఉంటే మనిషి వేరే దేశంలో ఉన్నట్లుగా ఎన్నారైల పరిస్థితి మారింది. విదేశాల్లో ఉంటూ పండగ చేసుకుని ఇక్కడి వారితో ఆ స్మృతుల్ని పంచుకునే అవకాశాన్ని ఎన్నారైలకు ‘ఈనాడు’ కల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న చోట మీరు చేసుకున్న వేడుక చిత్రాలు, మీ సొంత రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు కింద సూచించిన ఈ-మెయిల్‌కు పంపిస్తే ఎంపిక చేసినవి ‘ఈనాడు’, www.eenadu.net లో ప్రచురిస్తాం. మీ పూర్తి పేరు, చేసే ఉద్యోగం, మిమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్‌ వివరాలు తప్పనిసరిగా ఇవ్వగలరు. పూర్తి వివరాలు, ఫొటోలను eenadu.gudavalli9@gmali.comకి పంపగలరు.

Advertisement

Advertisement


మరిన్ని