తానా ఆధ్యర్యంలో చీరల పంపిణీ
తానా ఆధ్యర్యంలో చీరల పంపిణీ

కర్నూలు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం- తానా అధ్వర్యంలో దేవనకొండ మండలం కప్పట్రాళ్లలోని తానా స్త్రీ శక్తి భవనంలో 100 మంది మహిళలకు చీరలు, చేతి సంచులు పంపిణీ చేశారు. తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ దేవినేని లక్ష్మి, కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ వీటిని అందించారు.

ఈ సందర్భంగా దేవినేని లక్ష్మి మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ళ క్రిందట తానా స్త్రీ శక్తి భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని అన్నారు. డీఐజీ రవికృష్ణ, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల కప్పట్రాళ్ల గ్రామం అభివృద్ధిపథంలో పయనిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని తానా సహాయ సహకారాలు గ్రామానికి ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఛైర్ రామ్ చౌదరి ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులకు, వృద్ధులకు, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సహాయం అందించినట్లు తెలిపారు. కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ.. తానా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకొనే కప్పట్రాళ్ల సంబరాలు ఈ సంవత్సరం కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా జరపడం లేదని, పరిస్థితులు అనుకూలిస్తే కప్పట్రాళ్లలో రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఆ గ్రామానికి చెందిన షహీన్ అనే విద్యార్థినిని ఇంటర్మీడియట్ వరకు పొట్లూరి రవి చదివించారని మంచి కాలేజీ లో డిగ్రీ పూర్తి చెయ్యటానికి కూడా ఆయనే పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అమిత్, మధు, నారాయణ, మీనాక్షి ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.


మరిన్ని