అమెరికాలో శోభన్‌బాబు జయంతి 
అమెరికాలో శోభన్‌బాబు జయంతి 

హ్యూస్టన్ టెక్సాస్: అమెరికా గానకోకిల శారద ఆకునూరి రూపకల్పన, సారథ్యం దివంగత నటుడు‌ శోభన్‌బాబు 85వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ‘వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా-ఇండియా’ ఆధ్వర్యంలో శిరోమణి డాక్టర్‌ రామరాజు నిర్వహణలో జనవరి 23న ఆన్‌లైన్‌లో ఈ వేడుకలు జరిపారు. శోభన్‌బాబుతో కలిసి వివిధ చిత్రాల్లో  పనిచేసిన నటులు మురళీమోహన్, చంద్రమోహన్‌, డాక్టర్‌ జమున, దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు, రాశీ మూవీ క్రియేషన్స్ అధినేత నరసింహారావు, డా.నగేష్ చెన్నుపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభన్‌బాబుతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. 

సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిపోతుంటే తనని మాత్రం శోభన్‌బాబు మద్రాస్‌లోనే ఉండిపొమ్మన్నారని సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన సలహాతోనే తానిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం ఎప్పటికీ లోటేనని భావోద్వేగానికి గురయ్యారు. శోభన్‌బాబు చిత్రాల్లోని ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఆకునూరి శారదతో పాటు చెన్నైకి చెందిన రాము, అమెరికాకు చెందిన గాయనీగాయకులు విశ్వమోహన్, శ్రీకర్ దర్భ, నాగి, శ్వేతా, లక్ష్మిపలు పాటలు పాడి సంగీత నీరాజం అందించారు.

ఇవీ చదవండి...

అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక

అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

Advertisement

Advertisement


మరిన్ని