సింగపూర్‌ విదేశీ కార్మికుల సంఖ్యలో కోత
సింగపూర్‌ విదేశీ కార్మికుల సంఖ్యలో కోత

సింగపూర్‌: విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే లక్ష్యంతో సింగపూర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ రంగంలో విదేశీ కార్మికులకు అందించే ఎస్‌ పాస్‌ కోటాను వచ్చే రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి 15 శాతానికి దశలవారీగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సింగపూర్‌లోని తయారీ రంగ సంస్థలు తమ సిబ్బందిలో 18 శాతం మంది విదేశీయులను మాత్రమే నియమించుకోవడానికి వీలవుతుంది. 2023 ఆరంభం నుంచి అది 15 శాతానికి తగ్గుతుందని ఆ దేశ ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని హెంగ్‌ స్వీ కీట్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్య స్థాయి నైపుణ్యం కలిగిన విదేశీయులు సింగపూర్‌లో ఉద్యోగం పొందడానికి ఎస్‌ పాస్‌ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు ఉన్న నిపుణులు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఎస్‌ పాస్‌ కోటాలో కోతల వల్ల వీరి ఉపాధిపై ప్రభావం పడనుంది.


మరిన్ని