ఐదుగురు విద్యార్థులకు IAM అచీవ్‌మెంట్‌ అవార్డులు
ఐదుగురు విద్యార్థులకు IAM అచీవ్‌మెంట్‌ అవార్డులు

సెయింట్‌ పాల్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మిన్నెసొటా (IAM) పలువురు విద్యార్థులకు అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది. ఏటా ప్రదానం చేసే స్టూడెంట్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారానికి ఇటీవల హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు మిన్నెసొటా రాజధాని సెయింట్‌ పాల్‌లో నిర్వహించిన భారత 75వ స్వాతంత్ర్య వేడుకల్లో IAM అధ్యక్షుడు కిరణ్‌ బండి.. శ్రీని చెకా, డా. దాస్‌లతో కలిసి ఈ ఏడాది అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ అచీవ్‌మెంట్‌ పురస్కారాలను విద్యార్థుల అకడమిక్‌తో పాటు వారిలో ఉదారతా భావం, వ్యవస్థాపక నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేశారు.

గ్రహీతలు వీరే..

ఓజశ్విని తొడుపునూరి

సహన మంగిపూడి

యశ్‌ మంగలిక్‌

శివంగి పాండే

శ్రేయ కొంకిమళ్ల

Tags :

మరిన్ని