వెన్నెలకంటికి ‘తానా’ సంతాపం
వెన్నెలకంటికి ‘తానా’ సంతాపం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ గీత, మాటల రచయిత వెన్నెలకంటి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంతాపం ప్రకటించింది. ఆయన మరణం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు తీరని లోటని పేర్కొంది. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేసింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినెలా నిర్వహిస్తున్న ‘సినిమా పాటల్లో సాహిత్యం’ కార్యక్రమంలో గత డిసెంబర్‌ 27న వెన్నెలకంటి పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను అడిగిన ప్రశ్నలకు వెన్నెలకంటి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే ఆయన పాల్గొన్న చివరి సమావేశం కావడం విచారకరమన్నారు. వెన్నెలకంటి తనకు మంచి మిత్రుడని, తరచూ మాట్లాడుకునేవారమని ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకున్నారు. హఠాత్తుగా ఓ మంచి రచయితను కోల్పోవడం బాధాకరమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ అన్నారు.

Tags :

మరిన్ని