తానా కార్యదర్శి రవి పొట్లూరి చేయూత
తానా కార్యదర్శి రవి పొట్లూరి చేయూత

కర్నూలు: కరోనా మహమ్మారి ప్రభావంతో తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి చేయూత అందించారు. ఈ మేరకు గురువారం కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు రూ.50వేల ఉపకారవేతనాలను అందించారు. విద్యార్థినులు బి.గీత, వై.జోషిత ప్రకాశిని, బి.మమత, వై.లక్ష్మీ లిఖిత, బి.గాయత్రిలకు కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్ చేతుల మీదుగా ఉపకారవేతనాలు అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తానా తరఫున చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు. విద్యార్థినులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తానా కార్యదర్శి రవి పొట్లూరిని డీఎస్పీ అభినందించారు.

కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో సొంత నిధులు, మిత్రుల ద్వారా వంద మందికి పైగా విద్యార్థులకు రవి పొట్లూరి ఉపకారవేతనాలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా రూపొందించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ను డీఎస్పీ ఆవిష్కరించారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సందడి మధు, మీనాక్షి నాయుడు, అమిత్ జంపాల, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement


మరిన్ని