ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు చేరువ చేయాలి: వెంకయ్య
ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు చేరువ చేయాలి: వెంకయ్య

దిల్లీ: ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ తరానికి అర్థమయ్యే రీతిలో తెలుగు సాహితీ పునరుజ్జీవనం సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఇందుకు ప్రతి తెలుగువాడు చొరవ చూపించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇదే మార్గంలో అక్షర సేద్యం నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికాను అభినందించారు. భాష, సంస్కృతులు వేర్వేరు కావని, అవి రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకు పోయాయన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని