గెలుపుపై ట్రంప్‌, బైడెన్‌ ధీమా!
గెలుపుపై ట్రంప్‌, బైడెన్‌ ధీమా!

ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ పెరుగుతున్న ఉత్కంఠ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతోన్న కొద్దీ ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎలక్టోరల్ ఓట్లలో ప్రస్తుతానికి బైడెన్​ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద విజయం సాధించబోతున్నామని ట్రంప్‌ ప్రకటించారు. విజయంపై ఈరోజు రాత్రి ప్రకటన చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమొక్రాట్లు ఫలితాలను తారుమారు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రను భగ్నం చేస్తామన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్లు వేసే అవకాశం లేదన్నారు. 

మరోవైపు బైడెన్‌ సైతం తన విజయంపై ధీమాగా ఉన్నారు. గెలుపుపై తమకు విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల్లో డెమొక్రాట్లు చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.   

గెలుపును నిర్దేశించే రాష్ట్రాలుగా భావిస్తున్న టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానాల్లో ట్రంప్ గెలిస్తే ప్రస్తుతం ఉన్న బైడెన్‌ ఆధిక్యం గల్లంతవుతుంది. అయితే, ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగా ఉండడం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement


మరిన్ని