భారత్‌ పర్యటనకు దూరంగా ఉండండి: యూఎస్‌
భారత్‌ పర్యటనకు దూరంగా ఉండండి: యూఎస్‌

వాషింగ్టన్‌: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో యూఎస్‌ ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత్‌ పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రయాణికులు భారత పర్యటనకు దూరంగా ఉండాలి. టీకా తీసుకున్న వారు కూడా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్‌ పర్యటనను రద్దు చేసుకోవడం మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని సీడీసీ ప్రకటనలో పేర్కొంది. 

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా భారత్‌ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ప్రయాణాలపైనా బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  మరోవైపు భారత్‌లో కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ఆ దేశాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఆరోగ్య మంత్రి మాట్‌హాన్‌ కాక్‌ తెలిపారు. భారత్‌లో నిన్న 2.73లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 1,619 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1.50 కోట్లు దాటింది. 

Advertisement

Advertisement


మరిన్ని