భారత్‌ మ్యాప్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ
భారత్‌ మ్యాప్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ

రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర విదేశాంగశాఖ

దిల్లీ: ప్రపంచ  ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో భారత్ భూభాగాలను తప్పుగా చూపించడంపై ఆ సంస్థ వివరణ ఇచ్చిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయక మంత్రి మురళీధరన్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలను వేరుగా చూపుతుండటంపై భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ప్రతినిధి ఈ విషయంపై నేరుగా డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ జనరల్‌ను సంప్రదించారు. కాగా ఈ అంశాన్ని పరిశీలించి, సరిదిద్దుతామని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ టెడ్రోస్ అధనోమ్‌ అప్పట్లో తెలిపారు. కాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డిస్ల్కైమర్‌ను మంత్రి సభకు తెలిపారు. ‘‘ ఏ దేశానికి చెందిన భూభాగం, ప్రాంతం, సరిహద్దులను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించదు.’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణలో ఉంది. కాగా దేశ సరిహద్దులపై భారత్‌ స్పష్టంగా ఉందని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి..

పాక్‌ శాంతిని కోరుకునే దేశమట

కంగనకు ట్విటర్‌ మరోసారి షాక్‌

Advertisement

Advertisement


మరిన్ని