News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 17 May 2022 04:28 IST
1/28
పదో తరగతి మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాల్లో పలుచోట్ల సరైన వసతులు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. బల్లలు సరిపడా లేక ఇరుగ్గా కూర్చున్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో గదులన్నీ చీకటిగామారాయి. ఉన్న అరకొర లైట్ల వెలుగులూ సరిపోలేదు. కాగా, జవాబు పత్రాలు దిద్దే సమయంలో సెల్‌ఫోన్‌ వాడరాదనే నిబంధన ఉన్నా పలువురు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగించారు. పదో తరగతి మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాల్లో పలుచోట్ల సరైన వసతులు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సోమవారం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. బల్లలు సరిపడా లేక ఇరుగ్గా కూర్చున్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో గదులన్నీ చీకటిగామారాయి. ఉన్న అరకొర లైట్ల వెలుగులూ సరిపోలేదు. కాగా, జవాబు పత్రాలు దిద్దే సమయంలో సెల్‌ఫోన్‌ వాడరాదనే నిబంధన ఉన్నా పలువురు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగించారు.
2/28
3/28
మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు కమిషనరేట్‌ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్‌ వాక్‌ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మంత్రి దయాకర్‌రావు, సీపీ తరుణ్‌జోషి, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేస్తూనే యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు కమిషనరేట్‌ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్‌ వాక్‌ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మంత్రి దయాకర్‌రావు, సీపీ తరుణ్‌జోషి, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొని సందడి చేస్తూనే యువతకు అవగాహన కల్పించారు.
4/28
‘డ్రగ్‌ ఫ్రీ వాక్‌’ చేస్తున్న అదనపు డీసీపీ పుష్పారెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి ‘డ్రగ్‌ ఫ్రీ వాక్‌’ చేస్తున్న అదనపు డీసీపీ పుష్పారెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి
5/28
సంగారెడ్డి సన్‌రైస్‌ ఆసుపత్రి రోడ్డులో సోమవారం మధ్యాహ్నం అక్కాచెల్లెళ్లు రోడ్డు మీదుగా నడచుకొంటూ వెళ్తున్నారు. వీరిలో చెల్లికి చెప్పులు లేకపోవడంతో ఎండ తీవ్రతకు కాళ్లు కాలాయి. దీనిని గుర్తించిన అక్క చెల్లికి కష్టం కలుగకూడదని ఎత్తుకుని తీసుకెళ్లిన తీరు ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. సంగారెడ్డి సన్‌రైస్‌ ఆసుపత్రి రోడ్డులో సోమవారం మధ్యాహ్నం అక్కాచెల్లెళ్లు రోడ్డు మీదుగా నడచుకొంటూ వెళ్తున్నారు. వీరిలో చెల్లికి చెప్పులు లేకపోవడంతో ఎండ తీవ్రతకు కాళ్లు కాలాయి. దీనిని గుర్తించిన అక్క చెల్లికి కష్టం కలుగకూడదని ఎత్తుకుని తీసుకెళ్లిన తీరు ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
6/28
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని ఔషధ దుకాణం వద్ద పరిస్థితి ఇది. వైద్యులు రాసిన మందుల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న రోగులు, వారి సంబంధీకులు. తీరా కౌంటర్‌ వద్దకు వెళ్తే కొన్ని ఆసుపత్రిలో లేవంటూ   చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముందుగానే విషయం చెబితే గంటల తరబడి నిరీక్షించాల్సిన పని ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని ఔషధ దుకాణం వద్ద పరిస్థితి ఇది. వైద్యులు రాసిన మందుల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న రోగులు, వారి సంబంధీకులు. తీరా కౌంటర్‌ వద్దకు వెళ్తే కొన్ని ఆసుపత్రిలో లేవంటూ చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముందుగానే విషయం చెబితే గంటల తరబడి నిరీక్షించాల్సిన పని ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
7/28
ఈనెల 18వతేదీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో  సోమవారం నుంచి గురువారం వరకు ఉచిత ప్రవేశం కల్పించారు.  అద్భుత కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఏనుగు దంతాలపై చెక్కిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. ఈనెల 18వతేదీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో సోమవారం నుంచి గురువారం వరకు ఉచిత ప్రవేశం కల్పించారు. అద్భుత కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఏనుగు దంతాలపై చెక్కిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది.
8/28
9/28
ఉప్పల్‌లోని పాదచారుల ఆకాశ వంతెన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎల్బీనగర్‌, రామంతాపూర్‌, వరంగల్‌,  సికింద్రాబాద్‌ మార్గాల నుంచి వచ్చిన పాదచారులు ఇబ్బందులు పడకుండా అన్ని రోడ్లను కలుపుతూ 660 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు 8 లిఫ్టులు, నలువైపులా ఎస్కలేటర్లు ఉండేలా రూ.36.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఉప్పల్‌లోని పాదచారుల ఆకాశ వంతెన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎల్బీనగర్‌, రామంతాపూర్‌, వరంగల్‌, సికింద్రాబాద్‌ మార్గాల నుంచి వచ్చిన పాదచారులు ఇబ్బందులు పడకుండా అన్ని రోడ్లను కలుపుతూ 660 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు 8 లిఫ్టులు, నలువైపులా ఎస్కలేటర్లు ఉండేలా రూ.36.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు.
10/28
చింత చిగురుతో చేసిన పప్పు అంటే ఎవరికి ఇష్టముండదు.. ఆ చింత చిగురు కోసేవారు పడే కష్టం చూడండి. చిటారు కొమ్మ వరకు ఎక్కి కోస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని బాపూజీనగర్‌ సమీపంలో చింత చెట్లు ఎక్కువ ఉండడంతో కొంతమంది మహిళలు ప్రాణాలకు తెగించి చిగురు కోసి అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. గతంలో ఇక్కడ రెండుసార్లు చెట్లపై నుంచి కిందపడి గాయాలపాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. చింత చిగురుతో చేసిన పప్పు అంటే ఎవరికి ఇష్టముండదు.. ఆ చింత చిగురు కోసేవారు పడే కష్టం చూడండి. చిటారు కొమ్మ వరకు ఎక్కి కోస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని బాపూజీనగర్‌ సమీపంలో చింత చెట్లు ఎక్కువ ఉండడంతో కొంతమంది మహిళలు ప్రాణాలకు తెగించి చిగురు కోసి అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. గతంలో ఇక్కడ రెండుసార్లు చెట్లపై నుంచి కిందపడి గాయాలపాలయ్యారని స్థానికులు చెబుతున్నారు.
11/28
12/28
కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం పత్రాలను అధికారులకు ఇచ్చారు. సర్వే చేయించి ఆక్రమణకు గురైన తన స్థలం గుర్తించి తనకు ఇప్పించాలని 2018, 2021లో చలానా కూడా కట్టారు. అయినా అధికారులు వచ్చి సక్రమంగా కొలతలు వేసి.. ఆక్రమిత స్థలాన్ని తనకు ఇప్పించలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల నుంచి భార్యా పిల్లలతో కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చేనేత వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని.. తనకు న్యాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్లోని అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం పత్రాలను అధికారులకు ఇచ్చారు. సర్వే చేయించి ఆక్రమణకు గురైన తన స్థలం గుర్తించి తనకు ఇప్పించాలని 2018, 2021లో చలానా కూడా కట్టారు. అయినా అధికారులు వచ్చి సక్రమంగా కొలతలు వేసి.. ఆక్రమిత స్థలాన్ని తనకు ఇప్పించలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల నుంచి భార్యా పిల్లలతో కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చేనేత వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని.. తనకు న్యాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్లోని అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
13/28
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్లూరులో రక్షిత మంచినీటి పథకం లేదు. బాపురం ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి నీరు సరఫరా అవుతుంది. పైపులైన్‌ సరిగా లేకపోవడంతో రావడంలేదు. విధిలేక గ్రామస్థులు నిత్యం 1.5 కిలో మీటరు దూరంలోని వేదావతి నదిలోకి వెళ్తున్నారు. అక్కడ చెలిమలు తవ్వి నీటిని తెచ్చుకొంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. గ్రామంలో చేతి పంపులు ఉన్నా... ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్లూరులో రక్షిత మంచినీటి పథకం లేదు. బాపురం ఎస్‌ఎస్‌ట్యాంకు నుంచి నీరు సరఫరా అవుతుంది. పైపులైన్‌ సరిగా లేకపోవడంతో రావడంలేదు. విధిలేక గ్రామస్థులు నిత్యం 1.5 కిలో మీటరు దూరంలోని వేదావతి నదిలోకి వెళ్తున్నారు. అక్కడ చెలిమలు తవ్వి నీటిని తెచ్చుకొంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. గ్రామంలో చేతి పంపులు ఉన్నా... ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదు.
14/28
తన స్నేహితుడు ప్రసాద్‌ సాయంతో వస్తున్న ఈ దివ్యాంగుడి పేరు దుర్గాప్రసాద్‌.. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నివాసి.. డిగ్రీ, డీఎడ్‌ చదివారు. 2015లో ఆయన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మే కంటికి రెప్పలా చూస్తోంది. ప్రస్తుతం దుర్గాప్రసాద్‌ తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించని ఆయన పరిస్థితి అయోమంగా మారింది. ఓ వైపు అమ్మను చూసుకోలేని దైన్యం.. మరోవైపు ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్లాలన్నా వీల్‌ఛైర్‌ కూడా లేని దయనీయ పరిస్థితి. ఏ చిన్న పనికైనా స్నేహితులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉపాధి అవకాశం కల్పించి, వీల్‌ఛైర్‌ ఇప్పించి తనను ఆదుకోవాలని అధికారులకు విన్నవించేందుకు తన స్నేహితుడిని వెంటపెట్టుకొని కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఇలా వచ్చారు. తన స్నేహితుడు ప్రసాద్‌ సాయంతో వస్తున్న ఈ దివ్యాంగుడి పేరు దుర్గాప్రసాద్‌.. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నివాసి.. డిగ్రీ, డీఎడ్‌ చదివారు. 2015లో ఆయన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మే కంటికి రెప్పలా చూస్తోంది. ప్రస్తుతం దుర్గాప్రసాద్‌ తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించని ఆయన పరిస్థితి అయోమంగా మారింది. ఓ వైపు అమ్మను చూసుకోలేని దైన్యం.. మరోవైపు ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్లాలన్నా వీల్‌ఛైర్‌ కూడా లేని దయనీయ పరిస్థితి. ఏ చిన్న పనికైనా స్నేహితులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉపాధి అవకాశం కల్పించి, వీల్‌ఛైర్‌ ఇప్పించి తనను ఆదుకోవాలని అధికారులకు విన్నవించేందుకు తన స్నేహితుడిని వెంటపెట్టుకొని కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఇలా వచ్చారు.
15/28
డివైడర్ల మధ్యలో ఉన్న ప్రమాద సూచిక వంగిపోయి ప్రమాదకరంగా మారింది. వేగంగా వచ్చే వాహనాలు, అందునా రాత్రి వేళల్లో వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారే ప్రమాదముంది. రామవరప్పాడు, ఎనికేపాడు మధ్య కనిపించిన దృశ్యమిది. డివైడర్ల మధ్యలో ఉన్న ప్రమాద సూచిక వంగిపోయి ప్రమాదకరంగా మారింది. వేగంగా వచ్చే వాహనాలు, అందునా రాత్రి వేళల్లో వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారే ప్రమాదముంది. రామవరప్పాడు, ఎనికేపాడు మధ్య కనిపించిన దృశ్యమిది.
16/28
గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామి రథోత్సవం సోమవారం వైభవంగా సాగింది. భావనారాయణస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామి రథోత్సవం సోమవారం వైభవంగా సాగింది. భావనారాయణస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.
17/28
నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో పైవంతెన నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వంతెన గోడలపై చెట్లు ఏపుగా పెరగడంతో గోడలు బీటలు వారుతున్నాయి. వంతెనపై పలు ప్రాంతాల్లో కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో పైవంతెన నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వంతెన గోడలపై చెట్లు ఏపుగా పెరగడంతో గోడలు బీటలు వారుతున్నాయి. వంతెనపై పలు ప్రాంతాల్లో కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
18/28
అన్నమయ్య జిల్లాలోని వెలిగల్లు జలాశయం దిగువన పాపఘ్ని నది ఒడ్డున గండిమడుగు క్షేత్రం వద్ద నీటి మడుగులో కొండ ప్రతిబింబం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికొచ్చే సందర్శకులు ఇక్కడి అందాలను చూస్తూ మైమరచిపోతున్నారు. ప్రకృతి అందాల కోసం పర్యాటకులు విశేషంగా తరలివస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని వెలిగల్లు జలాశయం దిగువన పాపఘ్ని నది ఒడ్డున గండిమడుగు క్షేత్రం వద్ద నీటి మడుగులో కొండ ప్రతిబింబం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికొచ్చే సందర్శకులు ఇక్కడి అందాలను చూస్తూ మైమరచిపోతున్నారు. ప్రకృతి అందాల కోసం పర్యాటకులు విశేషంగా తరలివస్తున్నారు.
19/28
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన ఓ రైతు తన బోరు నుంచి పొలంలోకి సాగునీరు తరలించడానికి దేవరాపల్లిలో పైపులు కొన్నాడు. ఆ పైపుల్ని భుజాన వేసుకుని ఓ చేత్తో వీటిని పట్టుకుని మరో చేత్తో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పొలానికి తీసుకొచ్చాడు. ఆయనను చూసినవారంతా వాహనం నడుపుతున్న తీరుచూసి భయాందోళనకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన ఓ రైతు తన బోరు నుంచి పొలంలోకి సాగునీరు తరలించడానికి దేవరాపల్లిలో పైపులు కొన్నాడు. ఆ పైపుల్ని భుజాన వేసుకుని ఓ చేత్తో వీటిని పట్టుకుని మరో చేత్తో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పొలానికి తీసుకొచ్చాడు. ఆయనను చూసినవారంతా వాహనం నడుపుతున్న తీరుచూసి భయాందోళనకు గురయ్యారు.
20/28
ఈ వాహనానికి ఎనిమిది కాదు, పన్నెండు కాదు ఏకంగా 74 చక్రాలతో భారీ విద్యుత్తు నియంత్రికను తరలిస్తూ చూపరులను ఆకట్టుకుంది. రొకలిబండలాంటి లారీ.. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు విద్యుత్తు నియంత్రికను తరలించే ఈ ట్రాలీకు 64 చక్రాలు ఉండగా.. దీన్ని లాగే ఇంజిన్‌కు ఉన్న 10 చక్రాలు కలిపి మొత్తం 74 చక్రాలతో ముందుకు వెళ్తోంది. మార్గ మధ్యలో కాకినాడ జిల్లా తుని మండలంలోని వి.కొత్తూరు కూడలి వద్ద ఎండకు వాహన చోదకులు సేద తీరడంతో ఇలా కనిపించింది. మరో మూడు రోజుల్లో ఈ వాహనం గమ్యస్థానానికి చేరుతుందని వారు తెలిపారు. ఈ వాహనానికి ఎనిమిది కాదు, పన్నెండు కాదు ఏకంగా 74 చక్రాలతో భారీ విద్యుత్తు నియంత్రికను తరలిస్తూ చూపరులను ఆకట్టుకుంది. రొకలిబండలాంటి లారీ.. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు విద్యుత్తు నియంత్రికను తరలించే ఈ ట్రాలీకు 64 చక్రాలు ఉండగా.. దీన్ని లాగే ఇంజిన్‌కు ఉన్న 10 చక్రాలు కలిపి మొత్తం 74 చక్రాలతో ముందుకు వెళ్తోంది. మార్గ మధ్యలో కాకినాడ జిల్లా తుని మండలంలోని వి.కొత్తూరు కూడలి వద్ద ఎండకు వాహన చోదకులు సేద తీరడంతో ఇలా కనిపించింది. మరో మూడు రోజుల్లో ఈ వాహనం గమ్యస్థానానికి చేరుతుందని వారు తెలిపారు.
21/28
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశీనగర్‌లో మహాపరినిర్వాణ ఆలయంలో బుద్ధ విగ్రహానికి పూజలు చేస్తున్న ప్రధాని మోదీ. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశీనగర్‌లో మహాపరినిర్వాణ ఆలయంలో బుద్ధ విగ్రహానికి పూజలు చేస్తున్న ప్రధాని మోదీ.
22/28
23/28
జమ్మూలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం సందర్శించారు. అమ్మవారి దర్శనం అనంతరం సీజేఐ దంపతులకు ఆలయ ప్రతినిధులు ప్రసాదం, చిత్రపటం అందజేశారు. జమ్మూలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం సందర్శించారు. అమ్మవారి దర్శనం అనంతరం సీజేఐ దంపతులకు ఆలయ ప్రతినిధులు ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
24/28
‘అంతర్జాతీయ మ్యూజియం డే’ను పురస్కరించుకుని తిరుపతి రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన కానిస్టేబుల్‌ టి.సురేష్‌రెడ్డి నాణేలతో రూపొందించిన నమూనాలను ఏర్పాటు చేశారు. ఆయన 40 ఏళ్ల నుంచి నాణేలు సేకరిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు, దిల్లీ సుల్తానులు, మొగలులు, బ్రిటిష్‌ కాలం నాటి నాణేలు ప్రదర్శించారు. సుమారు 15 కిలోల బరువున్న నాణేలతో శ్రీవారి ఆనంద నిలయం నమూనాను తయారు చేశారు. వీటితో పాటు ఇండియాగేట్‌, చార్మినార్‌ తయారు చేసి ప్రదర్శించారు. ఇవి పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘అంతర్జాతీయ మ్యూజియం డే’ను పురస్కరించుకుని తిరుపతి రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన కానిస్టేబుల్‌ టి.సురేష్‌రెడ్డి నాణేలతో రూపొందించిన నమూనాలను ఏర్పాటు చేశారు. ఆయన 40 ఏళ్ల నుంచి నాణేలు సేకరిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు, దిల్లీ సుల్తానులు, మొగలులు, బ్రిటిష్‌ కాలం నాటి నాణేలు ప్రదర్శించారు. సుమారు 15 కిలోల బరువున్న నాణేలతో శ్రీవారి ఆనంద నిలయం నమూనాను తయారు చేశారు. వీటితో పాటు ఇండియాగేట్‌, చార్మినార్‌ తయారు చేసి ప్రదర్శించారు. ఇవి పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
25/28
26/28
సూది పట్టే సందున్నా సరే.. మొక్క ఇట్టే నాటుకుంటుంది. రావి, మర్రి వంటి మొక్కలైతే బండరాళ్లనూ ఆసరాగా చేసుకొని నెమ్మదిగా వేళ్లూనుకుంటాయి. చిత్రంలో చూస్తున్న రావి చెట్లూ అలా నాటుకున్నవే. పెద్ద పెద్ద బండరాళ్ల సందుల్లో పడిన గింజలు మొలకెత్తాయి. తర్వాత ఆ రాళ్లపైనే పెరిగినట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పరిశీలనగా చూస్తే ఆ చెట్ల వేర్ల చివరలు భూమిలోకి వెళ్లడాన్ని గమనించొచ్చు. ఏలూరు జిల్లా విలీన మండలం బండ్లబోరు గ్రామం సమీపంలో ఈ చెట్లు కనిపించాయి. సూది పట్టే సందున్నా సరే.. మొక్క ఇట్టే నాటుకుంటుంది. రావి, మర్రి వంటి మొక్కలైతే బండరాళ్లనూ ఆసరాగా చేసుకొని నెమ్మదిగా వేళ్లూనుకుంటాయి. చిత్రంలో చూస్తున్న రావి చెట్లూ అలా నాటుకున్నవే. పెద్ద పెద్ద బండరాళ్ల సందుల్లో పడిన గింజలు మొలకెత్తాయి. తర్వాత ఆ రాళ్లపైనే పెరిగినట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పరిశీలనగా చూస్తే ఆ చెట్ల వేర్ల చివరలు భూమిలోకి వెళ్లడాన్ని గమనించొచ్చు. ఏలూరు జిల్లా విలీన మండలం బండ్లబోరు గ్రామం సమీపంలో ఈ చెట్లు కనిపించాయి.
27/28
28/28
ఇటీవల అసని తుపాను దెబ్బకు అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు నిలువునా నష్టపోయారు. మామిడి చెట్లు విరిగిపోయి.. కాయలు రాలిపోయాయి. ఇలాంటి కాయలను సేకరించి మార్కెట్‌కు తరలిస్తే కొనేవారు కరవయ్యారు. సాధారణ కాయలు టన్ను ధర రూ.40-50 వేలు పలుకుతుండగా రాలిన కాయలను అడిగినవారే లేరు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల నుంచి ట్రాక్టర్లలో రాయచోటి మార్కెట్‌కు తరలించిన కాయలు అమ్ముడుపోకపోవడంతో రైతులు కసిరెడ్డికుంటలో పడేసి వెళ్లిపోయారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇటీవల అసని తుపాను దెబ్బకు అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు నిలువునా నష్టపోయారు. మామిడి చెట్లు విరిగిపోయి.. కాయలు రాలిపోయాయి. ఇలాంటి కాయలను సేకరించి మార్కెట్‌కు తరలిస్తే కొనేవారు కరవయ్యారు. సాధారణ కాయలు టన్ను ధర రూ.40-50 వేలు పలుకుతుండగా రాలిన కాయలను అడిగినవారే లేరు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల నుంచి ట్రాక్టర్లలో రాయచోటి మార్కెట్‌కు తరలించిన కాయలు అమ్ముడుపోకపోవడంతో రైతులు కసిరెడ్డికుంటలో పడేసి వెళ్లిపోయారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

మరిన్ని